దొంగలకు చెప్పిన కాలజ్ఞానం
దొంగలకు చెప్పిన కాలజ్ఞానం
“దేశానికి ఆపదలు తప్పవు.
ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది.
ఆరు మతాలూ ఒక్కటవుతాయి.
నిప్పుల వాన కురుస్తుంది.
నెల్లూరు జలమయం అవుతుంది.
నెత్తురు ఏరులై పారుతుంది.
ఏడు గ్రామాలకు ఒక గ్రామం, ఏడిళ్ళకు ఒక ఇల్లు మిగులుతాయి.
ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు.
పార్వతి, బసవేశ్వరుల కంట నీరు కారుతుంది.
కప్పలు కోడికూతలు కూస్తాయి, భూమి కంపిస్తుంది.
అప్పుడు నేను సమాధిలో నుంచి వీర భోగ వసంతరాయులుగా మరల జన్మిస్తాను’’ అని వివరించారు.